Share News

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:59 PM

బీజేపీ (BJP) మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు సునీల్ బన్సల్ చంద్రశేఖర్, బండి సంజయ్, లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు

హైదరాబాద్: బీజేపీ (BJP) మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు సునీల్ బన్సల్ చంద్రశేఖర్, బండి సంజయ్, లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన నేతలు చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మంచి సానుకూల వాతావరణం ఉందని తెలిపారు.ప్రతి పోలింగ్ బూత్‌లో ముఖ్యమైన నాయకుడిని సమన్వయ కర్తగా నియమించుకోవలని కోరారు. ప్రతి ఇంటికెళ్లి ప్రతి ఓటరును కలవాలని కేడర్‌కు సూచించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీవితంలో ప్రధాని కాలేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Jagtial Drugs Case: జగిత్యాల డ్రగ్స్ కేసులో మరో సంచలన కోణం.. గంజాయి ఇచ్చి మరీ ఓ యువతిపై..

KTR: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 05:59 PM