Share News

Singareni Job Notification: సింగరేణిలో 485 పోస్టులు.. గురువారం నోటిఫికేషన్..!

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:22 PM

Singareni Job Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. 485 ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది సింగరేణి సంస్థ. వీటి భర్తీకి సంబంధించి గురువారం(ఫిబ్రవరి 22) నాడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఎండీ ప్రకటించారు.

Singareni Job Notification: సింగరేణిలో 485 పోస్టులు.. గురువారం నోటిఫికేషన్..!
Singareni Job Notification 2024

Singareni Job Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. 485 ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది సింగరేణి సంస్థ. వీటి భర్తీకి సంబంధించి గురువారం(ఫిబ్రవరి 22) నాడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఎండీ ప్రకటించారు. సింగరేణిలో 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ప్రకటించారు.

బుధవారం నాడు సింగరేణిలో అభివృద్ధి, సంక్షేమంపై సంస్థ సీఎండీతో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఈ సంవత్సరం సింగరేణిలో 1000 వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని సూచించారు. అలాగే కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలన్నారు. ఈ నెల 26న కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించ‌నున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల నేపథ్యంలో.. సింగరేణిలో నియామకాలపై నిర్ణయం తీసుకున్నారు సీఎండీ. కాగా, కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాపై యూబీఐతో ఒప్పందం చేసుకుంటామని సీఎండీ బలరామ్ తెలిపారు.

Updated Date - Feb 21 , 2024 | 08:22 PM