Share News

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, హరీశ్‌ను ముద్దాయిలుగా చేర్చండి: రఘునందన్ రావు

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:27 PM

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌లో  కేసీఆర్, హరీశ్‌ను ముద్దాయిలుగా చేర్చండి: రఘునందన్ రావు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ (Phone Tapping) చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇంచార్జీ హరీష్ రావు, కలెక్టర్ వెంకట రామిరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొనుగోలు చేసింది ఎవరు..?

ఫోన్ ట్యాపింగ్ డివైస్ కొనుగోలు చేసింది ఎవరని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని రఘునందన్ రావు కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటకలో కుమార స్వామికి లబ్ది చేకూరేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అందేలా శ్రీరాములు యాదవ్ నంబర్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

సినీ ప్రముఖుల ఫోన్లు

ట్యాపింగ్ గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు చెప్పాలని రఘునందన్ కోరారు. సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫోన్లను వదల్లేదన్నారు. వారిలో కొందరికి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూల్ చేశారని ఆరోపించారు. మాజీమంత్రి హరీశ్ రావు బినామీ చానెల్ ఓనర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Mar 27 , 2024 | 05:27 PM