Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 03:31 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై (Phone Tapping Case) తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళీ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కూతురుగా ఉన్నప్పుడు లిక్కర్ అక్రమ వ్యాపారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై (Phone Tapping Case) తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళీ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS) పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కూతురుగా ఉన్నప్పుడు లిక్కర్ అక్రమ వ్యాపారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని, మేఘా కృష్ణారెడ్డి బీజేపీకి వెయ్యి కోట్ల రూపాయలను పార్టీ ఫండ్‌గా ఇచ్చారని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం అవినీతిపై నోరు మెదపడం లేదని అన్నారు.

ఇక మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మాట్లాడుతూ.. కొత్త-పాత కార్యకర్తలను కలుపుకుని పోతామని అన్నారు. వారంలో ఐదు రోజులు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని ప్రజలు, పార్టీ శ్రేణులకు ఆయన హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

Harish Rao: సీఎంఆర్ఎఫ్ చెక్కుల కాజేతపై స్పందించిన హరీశ్ రావు కార్యాలయం

IPL: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2024 | 03:37 PM