Share News

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:25 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ
Kavitha

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉంటారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది.

TG Elections: కాంగ్రెస్ అంటేనే స్కాములు.. సీఎం రేవంత్‌పై మందకృష్ణ మాదిగ ఆగ్రహం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 09:25 PM