Share News

Jeevanreddy: అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా?.. కవితకు కౌంటర్

ABN , Publish Date - Jan 26 , 2024 | 01:43 PM

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఅర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని అనడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

Jeevanreddy: అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా?.. కవితకు కౌంటర్

జగిత్యాల, జనవరి 26: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై (BRS MLC Kavitha) కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) భయపెడుతుందని అనడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. బీఆర్‌ఎస్ (BRS) చేసినట్టు కాంగ్రెస్ చెయ్యదని స్పష్టం చేశారు. ఎవరు ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్...? కవిత సమాధానం చెప్పాలన్నారు. ‘‘అధికారం, ప్రతిపక్షం రెండు చేసినం.. అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా? నేను కక్ష్య పూరీతంగా వ్యవహరిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. చదవలసిన చరిత్ర చాలా ఉంది. ఇప్పుడే ఉలిక్కిపడితే ఎలా? 2014కు ముందు మీరు, ఆ తరవాత మీరు అనేది కూడా చూపిస్తాం’’ అంటూ జీవన్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 26 , 2024 | 01:43 PM