Share News

TG: రేవంత్‌ను అరెస్టు చేస్తే మోదీకి పుట్టగతులుండవ్‌

ABN , Publish Date - May 03 , 2024 | 05:01 AM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తే ప్రధాని మోదీకి పుట్టగతులుండవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు.

TG: రేవంత్‌ను అరెస్టు చేస్తే మోదీకి పుట్టగతులుండవ్‌

  • దత్తపుత్రుడు కావడం వల్లే జగన్‌ను ముట్టుకోవట్లేదు

  • ‘ఇండియా’ కూటమి విజయం ఖాయం: నారాయణ

ఖమ్మం, మే 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తే ప్రధాని మోదీకి పుట్టగతులుండవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న కక్షతో ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను మోదీ జైలుకు పంపారని, తాజాగా ఇప్పుడు సీఎం రేవంత్‌కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ఒకవేళ ఈ అరెస్టు జరిగితే రేవంత్‌ ప్రతిష్ఠ పెరుగుతుందని, మోదీ ప్రతిష్ఠ దిగజారుతుందని స్పష్టం చేశారు.


ఖమ్మంలో గురువారం సీపీఐ లోక్‌సభ నియోజకవర్గస్థాఽయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రూ.లక్ష కోట్లు దోచుకున్న ఏపీ సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నా బీజేపీకి దత్తపుత్రుడు కావడం వల్లే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దేశంలోని 29 మంది కార్పొరేట్‌ శక్తుల కోసమే మోదీ పాలన సాగిస్తున్నారని, అంబానీ-అదానీలకు ఆయన దత్తపుత్రుడని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Updated Date - May 03 , 2024 | 05:01 AM