Share News

Crime: హైదరాబాద్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పై యువకుల దాడి..

ABN , Publish Date - Mar 12 , 2024 | 08:39 AM

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న టీసీఎస్ ఉద్యోగి కుర్వ నవీన్ కుమార్‌పై యూనివర్సిటీ వద్ద 8 మంది యువకులు అకారణంగా దాడి చేశారు.

Crime: హైదరాబాద్, సాఫ్ట్‌వేర్  ఉద్యోగి పై యువకుల దాడి..

హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ (IT Corridor) పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software employee)పై గుర్తు తెలియని యువకులు (youth) దాడి (Crime) చేశారు. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న టీసీఎస్ (TCS) ఉద్యోగి కుర్వ నవీన్ కుమార్‌పై యూనివర్సిటీ వద్ద 8 మంది యువకులు అకారణంగా దాడి చేశారు. కొర్రెముల చౌరస్తా వరకు వెంబడించి చితకబాదారు. కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం యువకులు బలవంతంగా కారును తీసుకెళ్లారు. నారపల్లి నందనవనం వద్ద కారును వదిలి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 12 , 2024 | 08:42 AM