Share News

BRS MLA Lasya: లాస్య కారు ప్రమాదానికి ముందు అసలేం జరిగింది..?

ABN , Publish Date - Feb 23 , 2024 | 01:58 PM

#RIP LasyaNanditha బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) దుర్మరణంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది..? అసలు ఈ ఘటనకు ముందు ఏం జరిగింది..? లాస్య ఎక్కడికెళ్లి తిరిగొస్తున్నారు..? మార్గమధ్యలో ఏదైనా జరిగిందా..? ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) పరిశీలనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి...

BRS MLA Lasya: లాస్య కారు ప్రమాదానికి ముందు అసలేం జరిగింది..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) దుర్మరణంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది..? అసలు ఈ ఘటనకు ముందు ఏం జరిగింది..? లాస్య ఎక్కడికెళ్లి తిరిగొస్తున్నారు..? మార్గమధ్యలో ఏదైనా జరిగిందా..? ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) పరిశీలనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ప్రమాదానికి ముందు ఏం జరిగిందో చూసేద్దాం రండి..


Lasya.jpg

ఇదీ జరిగింది..!

గురువారం అర్ధరాత్రి ఇంటి నుంచి లాస్య కుటుంబసభ్యులు బయల్దేరి వెళ్లారు. సదాశివపేటలో ఒక దర్గాలో ప్రార్థనల కోసం లాస్య కుటుంబం వెళ్లింది. అక్కడ్నుంచి మూసాపేట్‌కు వెళ్లి అక్క కూతురు శ్లోకకు పరీక్షలు ఉండటంతో కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉండిపోయారు. ఆకలిగా ఉండటంతో మార్గమధ్యలో దాబా కోసం మళ్లీ సదాశివపేట‌కు లాస్య నందిత, డ్రైవర్/పీఏ ఆకాష్ కలిసివెళ్లారు. ఆకాష్ డ్రైవింగ్ చేయగా.. లాస్య ముందు సీటులోనే కూర్చున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో కారు 100 స్పీడులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మీస్కిన్ బాబా దర్గా ఉంటుంది. ఆరూర్ నుంచి కోనాపూర్ వెళ్లే మార్గమధ్యలో ఉన్న ఈ దర్గాలో ఎమ్మెల్యే లాస్య అర్ధరాత్రి సుమారు 12: 30 గంటలకు వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు. అనంతరం మొక్కలు తీసుకున్న తర్వాత తెల్లారుజామున 03 నుంచి 04 గంటలో మధ్యలో లాస్య తిరుగుపయనం అయ్యారని దర్గా నిర్వహకులు చెప్పారు. మొక్కులు తీర్చాక దర్గాలోనే ఉండి ఉన్నా.. లేదా దాబాలోనే విశ్రాంతి తీసుకొని ఉన్నా లాస్య ప్రాణాలతో ఉండేదేమో అని అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.


lasya5.jpg

ఆకాష్ కోలుకున్నాకే..!

లాస్య నందిత కారు ప్రమాదంపై సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. శుక్రవారం 05:30 గంటలకు సుల్తాన్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. కారు డ్రైవర్ ఆకాష్ కోలుకున్న తర్వాత అతని స్టేట్మెంట్ నమోదు చేస్తాంఅని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

Lasya-Driver-Aakash.jpg

బ్యాక్ కాదు.. ఫ్రంట్ సీటులోనే..!

ఇదే ఘటనపై ఆర్టీవో విజయ్ రావు ఏబీఎన్‌తో మాట్లాడారు. ‘ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై విచారణ చేస్తున్నాం. ప్రాథమిక దర్యాప్తులో అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించాం. ఔటర్‌కు ఆనుకొని ఉన్న రెలింగ్ ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించాం. మరో వాహనానికి ఢీ కొట్టిందా..? అనేదానిపై విచారణ చేస్తాం. పోలీసులు, ఆర్టీవో అధికారులు సంయుక్తంగా దర్యాప్తు జరిపి రిపోర్టును తయారు చేస్తాం. ప్రమాదం సమయంలో డ్రైవింగ్ సీట్లో ఆకాష్ కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు. పక్క సీట్లోనే ఎమ్మెల్యే లాస్య నందిత కూర్చున్నట్లు గుర్తించాం. రెండు ఎయిర్ బెలూన్సు ఓపెన్ అయ్యాయి.. కానీ లాస్య నందితకు గాయాలయ్యాయి. పూర్తి దర్యాప్తు తరువాత వివరాలు వెల్లడిస్తాం’ అని విజయ్‌రావు వెల్లడించారు.

lasya4.jpg

లాస్యకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం ఎలా జరిగింది.. కారణాలేంటి..!?


MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంపై డ్రైవర్ నోట ఒకే ఒక్క మాట..


Updated Date - Feb 23 , 2024 | 05:39 PM