Share News

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం ఎలా జరిగింది.. కారణాలేంటి..!?

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:18 AM

#RIPLasya Nanditha: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురవ్వడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు, ఎలా జరిగింది..? అని అభిమానులు, అనుచరులు ఆరా తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు...

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం ఎలా జరిగింది.. కారణాలేంటి..!?

బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురవ్వడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు, ఎలా జరిగింది..? అని అభిమానులు, అనుచరులు ఆరా తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీ కొన్నది. దీంతో నందిత ఘటనాస్థలిలోనే మరణించగా, ఆమె పీఏ ప్రకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్ నుంచి పఠాన్‌చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఈ ఘటన జరిగింది.


Lasya-Nanditha-Dead.jpg

నిపుణులు ఏమంటున్నారు..?

ఇదిలా ఉంటే.. నందిత మరణానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతీ సుజుకీ XL6 సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీటు బెల్ట్ పెట్టుకోవడం ఒక కారణమని చెబుతున్నారు. సడన్ బ్రేక్ వేయడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటును వేగంగా ఢీ కొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు, వైద్యులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు.. నార్కట్‌పల్లిలో నందిత స్కార్పియో కారు.. ప్రమాదానికి గురైంది. అప్పుడే డ్రైవర్‌ను మార్చి ఉంటే నందిత ప్రాణాలు ఉండేవారేమోనని అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు.. నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారు ఉన్నా.. ఇంత ప్రమాదం జరిగేది కాదని చెబతున్న పరిస్థితి.

Lasya.jpg

ఎవరీ నందిత..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీచేసిన నందిత గెలుపొందారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన యంగ్ ఎమ్మెల్యే ఈమే. గత ఏడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణాంతరం.. కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. నందిత ఇవాళ దుర్మరణం చెందడంతో అభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. గత ఫిబ్రవరిలో తండ్రి.. ఈ ఫిబ్రవరిలో కుమార్తె మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు.. సాయన్న కుటుంబానికి ఫిబ్రవరి గండం ఉందని అనుచరులు చెప్పుకుంటున్నారు.


Lasya-Nanditha-Car.jpg

తృటిలో తప్పించుకుని..!

ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నల్గొండ వేదిగా భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం విదితమే. ఈ సభకు నందిత కూడా వెళ్లారు. తిరుగుపయనంలో నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద లాస్య ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే.. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రస్తుతం నందిత మృతదేహాన్ని పఠాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్ కీలక నేతలు, వీరాభిమానులు ఇప్పుడిప్పుడే ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

lasya.jpg

Lasya Nanditha: కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 11:30 AM