Share News

AV Ranganath: సాహితీ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపడుతాం

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:13 PM

సాహితీ ఇన్‌ఫ్రా ( Sahithi Infra ) చేసిన స్కామ్‌ ( Scam ) రూ.1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేశారు.ఫ్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్దఎత్తున సాహితీ ఇన్‌ఫ్రా డబ్బు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ కేసుని స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని జాయింట్ సీపీ సీసీఎస్ ఏవీ రంగనాథ్ ( AV Ranganath ) సోమవారం నాడు మీడియాకు వివరించారు.

 AV Ranganath: సాహితీ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపడుతాం

హైదరాబాద్: సాహితీ ఇన్‌ఫ్రా ( Sahithi Infra ) చేసిన స్కామ్‌ ( Scam ) రూ.1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేశారు.ఫ్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్దఎత్తున సాహితీ ఇన్‌ఫ్రా డబ్బు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ కేసుని స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని జాయింట్ సీపీ సీసీఎస్ ఏవీ రంగనాథ్ ( AV Ranganath ) సోమవారం నాడు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాహితీ కేసుని పారదర్శకంగా దర్యాప్తు చేపడుతాన్నామని చెప్పారు. సాహితీ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న సాహితీ ఇన్‌ఫ్రాకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తామన్నారు.

మోసపోయిన బాధితులు ఎవరు ఉన్న సీసీఎస్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేసులను సీసీఎస్‌కు బదిలీ చేసేలా చూస్తామన్నారు. సాహితీ అన్ని ప్రాజెక్ట్‌ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో కేసును ఓ కొలిక్కి తీసుకువస్తామని చెప్పారు. సాహితీ లక్ష్మి నారాయణ ద్వారా లబ్ధి పొందిన వారందరిని విచారిస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుళ్లాగే హైకోర్టు ఆదేశాలతో సాహితీ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 03:46 PM