Share News

Hyderabad: దయచేసి వినండి.. ఇకపై చర్లపల్లి నుంచి రైళ్లు పరుగులు తీస్తాయండి..

ABN , Publish Date - Feb 17 , 2024 | 02:27 PM

హైదరాబాద్ మహానగరంలో ప్రయాణీకులకు అవసరమైన రవాణా సౌకర్యాలు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలపై రద్దీ భారాన్న తగ్గించేందుకు...

Hyderabad: దయచేసి వినండి.. ఇకపై చర్లపల్లి నుంచి రైళ్లు పరుగులు తీస్తాయండి..

హైదరాబాద్ మహానగరంలో ప్రయాణీకులకు అవసరమైన రవాణా సౌకర్యాలు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలపై రద్దీ భారాన్న తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినస్ ను ఆధునీకరిస్తోంది. మార్చి మొదటి వారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఇక్కడి నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపాలని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన రైల్వే బోర్డు 3 జతల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అక్కడి నుంచే రాకపోకలు సాగించేలా, మరో 6 జతల ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను చర్లపల్లి స్టేషన్‌లో ఆపేందుకు అనుమతులు మంజూరు చేసింది.

18045/18046 షాలీమర్‌ - హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌, 12603/12604 ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, 12589/12590 గోరఖ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు చర్లపల్లి నుంచి బయల్దేరనుండగా 17011/17012 హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, 12757/12758 సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, 17201/17202 గుంటూరు - సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, 17233/17234 సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, 12713/123714 విజయవాడ - సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, 12705/12706 గుంటూరు - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు చర్లపల్లిలో ఆగుతాయి.


కాగా.. చర్లపల్లి స్టేషన్‌ను రెండు అంతస్తుల్లో నిర్మించనున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో విశ్రాంతి గదులు, హోటళ్లు, రైల్వే అధికారుల కార్యాలయాలు ఉంటాయి. ఎయిర్ పోర్ట్ మాదిరిగా ప్రయాణికులు ప్రవేశద్వారం నుంచి నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకొనేలా మొదటి అంతస్తు ఉంటుంది. మొదటి విడతలో మొత్తం 8 లైన్‌లతో ప్లాట్‌ఫాంలను విస్తరిస్తారు. దశలవారీగా ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరగనుంది. అన్ని ప్లాట్‌ఫాంలకు చేరుకొనేలా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 02:27 PM