Share News

TS News: చెరువులో పడిన బాలుడిని కాపాడబోయి మరో బాలుడు..

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:24 AM

Telangana: నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువు వద్ద ఆదుకునేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చెరువులో పడ్డాడు. అయితే విషయం గమనించిన మరో బాలుడు పవన్.. బాలుడిని కాపాడేందుకు వెళ్ళి నీటిలో మునిగాడు. ఇద్దరు బాలురను గమనించి స్థానికులు వారిని రక్షించేందుకు వెంటనే చెరువులోకి దూకారురర.

TS News: చెరువులో పడిన బాలుడిని కాపాడబోయి మరో బాలుడు..

హైదరాబాద్, మార్చి 18: నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువు వద్ద ఆదుకునేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చెరువులో పడ్డాడు. అయితే విషయం గమనించిన మరో బాలుడు పవన్.. బాలుడిని కాపాడేందుకు వెళ్ళి నీటిలో మునిగాడు. ఇద్దరు బాలురను గమనించి స్థానికులు వారిని రక్షించేందుకు వెంటనే చెరువులోకి దూకారురర. అయితే మొదట మునిగిన బాలుడిని స్థానిక యువకులు కాపాడారు. కానీ కాపాడేందుకు వెళ్ళిన పవన్ కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకని పరిస్థితి. డీఆర్‌ఎఫ్ టీమ్ నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టింది. ఈరోజు ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పవన్ ఆచూకీ దొరకలేదు.

ఇవి కూడా చదవండి..

Big Breaking: కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల!

10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 18 , 2024 | 10:24 AM