Share News

Chiranjeevi: ఈ గణతంత్ర దినోత్సవం నాకు ప్రత్యేకమైనది: చిరంజీవి

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:57 AM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు.

Chiranjeevi: ఈ గణతంత్ర దినోత్సవం నాకు ప్రత్యేకమైనది: చిరంజీవి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల తాగ్యఫలం వల్లే ఈ రోజు మనం స్వేచ్చగా బ్రతకగలగుతున్నామని అన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం తనకు ఎంతో ప్రత్యేకమైనదని, పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారన్నారు. 2006లో తనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చినప్పుడు అదే ఎంతో గొప్ప విషయంగా భావించానని, ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తారని ఊహించలేదన్నారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చిరంజీవి చెప్పారు.

కాగా రాజకీయాల్లో.. సినిమాల్లో.. ఇలా రెండు వేర్వేరు రంగాల్లో ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ స్వయంకృషితో, అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఇద్దరు అసామాన్యులైన తెలుగు తేజాలను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది. వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాగా.. మరొకరు తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది.

Updated Date - Jan 26 , 2024 | 10:57 AM