Share News

TS NEWS: వీడిన మొయినాబాద్ యువతి మృతి కేసు

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:20 PM

మొయినాబాద్ యువతి మృతి కేసు వీడింది. మృతురాలు మల్లేపల్లికి చెందిన తహసీన్‌గా పోలీసులు గుర్తించారు. డిప్రెషన్‌తోపాటు స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తహసీన్‌ మృతిపై పోలీసులు వివరాలు ప్రకటించారు.

TS NEWS: వీడిన మొయినాబాద్ యువతి మృతి కేసు

రంగారెడ్డి: మొయినాబాద్ యువతి మృతి కేసు వీడింది. మృతురాలు మల్లేపల్లికి చెందిన తహసీన్‌గా పోలీసులు గుర్తించారు. డిప్రెషన్‌తోపాటు స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తహసీన్‌ మృతిపై పోలీసులు వివరాలు ప్రకటించారు. ‘‘ఈనెల 8వ తేదీన ఉదయం 11:30 గంటలకి ఇంటి నుంచి తహసీన్ బయల్దేరింది. మధ్యాహ్నం 12:30 గంటలకు స్నేహితులను తహసీన్ కలిసింది. మల్లేపల్లి నుంచి ఆటోలో మొయినాబాద్‌కు తహసీన్ వచ్చింది. తనతోపాటు 5 లీటర్ల క్యాన్‌ను తహసీన్ తెచ్చుకుంది.ఆటో డ్రైవర్‌కి రూ.1100 ఆమె చెల్లించింది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపింది. ఆత్మహత్య చేసుకుంటునట్లు వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నది. మధ్యాహ్నం 2:15గంటలకి తహసీన్ ఆత్మహత్య చేసుకుంది’’ అని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్‌తోపాటు స్నేహితుడిని ప్రశ్నించగా అసలు నిజం తేలిందని పోలీసులు చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 10:20 PM