Share News

TS News: టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడులు

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:44 PM

హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రసాయనాలతో మామిడిపండ్లు నిల్వ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

TS News: టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడులు

హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో టాస్క్ ఫోర్స్ (Taskforce), జీహెచ్ఎంసీ (GHMC) ఫుడ్ సేఫ్టీ (Food Safety) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రసాయనాలతో మామిడిపండ్లు నిల్వ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడి షాపులను అధికారులు సీజ్ చేశారు. రూ.4.5 లక్షల విలువ చేసే మామిడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మరో కేసులో ఇంటర్నేషనల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ (Telephone Exchange) నడుపుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ టెలికాం ఉద్యోగులే కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తున్న ఇద్దరు నిందితులను సంతోష్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎక్విప్మెంట్‌ను సీజ్ చేశారు.

Delhi Liquor Scam: అభిషేక్ బోయినపల్లికి బెయిల్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 12:44 PM