Share News

Srinivas Goud: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా.. కాంగ్రెస్ వేవ్ వల్ల ఓడిపోయం

ABN , Publish Date - Jan 18 , 2024 | 09:44 PM

తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా కాంగ్రెస్ వేవ్ వల్ల ఓడిపోయామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud ) అన్నారు.

 Srinivas Goud: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా.. కాంగ్రెస్ వేవ్ వల్ల ఓడిపోయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా కాంగ్రెస్ వేవ్ వల్ల ఓడిపోయామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud ) అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ... 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. తెలంగాణ రావడానికి మహబూబ్‌నగర్ కీలక పాత్ర పోషించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలకు మోసపోయి ప్రజలు ఓట్లు వేశారన్నారు. సోషల్ మీడియా అసత్య ప్రచారం కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడిందని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన కళ్యాణలక్ష్మీ తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలతో మొదలైన కష్టాలు...రైతు బంధు బంద్ వరకు వచ్చిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు అందరికీ రేషన్ కార్డులు ఇస్తారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారా...లేదా...? పింఛన్ 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. డిసెంబర్ 9వ తేదీ లోపు అన్ని పథకాలు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని... ఇంతవరకు గ్యారెంటీలపై స్పష్టత లేదన్నారు. వంద రోజుల తర్వాత ప్రభుత్వ హామీలపై పోరాటం చేస్తామని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం... తెలంగాణలో విజయానికి ఉపయోగపడిందని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో లోక్‌సభ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా కలిసి కట్టుగా పని చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 10:04 PM