Share News

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:27 AM

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తు్న్న కారు హిమాయత్ సాగర్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతి వేగంగా వస్తు్న్న కారు (Car) హిమాయత్ సాగర్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ఔటర్‌పై డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి.. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో అందరూ యువకులే ఉన్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతి చెందిన యువకులు గౌతమ్, ఆనంద్‌గా గుర్తించారు. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు ఐదు పల్టీలు కొట్టింది. కారు పల్టీలు కొడుతుండగానే... కారులో నుంచి ఇద్దరు యువకులు పడిపోయారు. ప్రమాద సమయంలో కారు 180 కి.మీ. స్పీడ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - Apr 14 , 2024 | 10:37 AM