Share News

Congress-BRS: హీటెక్కిన ప్రాజెక్ట్స్ ఫైట్

ABN , Publish Date - Feb 13 , 2024 | 09:18 AM

ప్రాజెక్ట్స్ ఫైట్ రోజురోజుకీ హీటెక్కుతోంది. నేడు అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. మరికాసేపట్లో కాంగ్రెస్ చలో మేడిగడ్డ, బీఆర్ఎస్ చలో నల్గొండ నిర్వహించనున్నాయి

Congress-BRS: హీటెక్కిన ప్రాజెక్ట్స్ ఫైట్

హైదరాబాద్: ప్రాజెక్ట్స్ ఫైట్ రోజురోజుకీ హీటెక్కుతోంది. నేడు అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. మరికాసేపట్లో కాంగ్రెస్ చలో మేడిగడ్డ, బీఆర్ఎస్ చలో నల్గొండ నిర్వహించనున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం నల్గొండకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు.

కాళేశ్వరం నిర్మాణ లోపాలు ఎత్తి చూపడానికి ఈ రోజు అఖిలపక్షం మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఎమ్మెల్యేల వెంట కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ప్రాజెక్టులను అప్పగించేది లేదని సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దని నల్గొండలో బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహించనుంది. నల్గొండ సభతో నేటి నుంచి ప్రజల్లోకి కేసీఆర్ వెళ్లనున్నారు. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత జనాల్లోకి కేసీఆర్ వెళ్లనున్నారు. నేడు కేసీఆర్ నిర్వహించనున్న ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Feb 13 , 2024 | 09:56 AM