Share News

Ponnam Prabhakar: కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:17 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉందన్నారు.

Ponnam Prabhakar: కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉందన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘10 సంవత్సరాల మీ పాలనలో సర్పంచ్‌లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా?.. సర్పంచ్‌లను పనులు, సస్పెన్షన్‌ల పేరుతో వేధించింది నిజం కాదా?.. ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరు నమ్మరు కేటీఆర్.. మీ హయాంలో రూ. 1100 కోట్ల బిల్లులు పెండింగ్.. 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - Jan 18 , 2024 | 10:27 AM