Share News

NDSA: జలసౌధలో ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:57 PM

Telangana: ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ శనివారం జలసౌధకు చేరుకుంది. రెండు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను కమిటీ పరిశీలించనుంది. ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో కమిటీ ఎన్‌డీఎస్‌ఏ బృందం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 2016 నుంచి ఆనకట్టల బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

NDSA: జలసౌధలో ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ

హైదరాబాద్, మార్చి 9: ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ (NDSA) శనివారం జలసౌధకు చేరుకుంది. రెండు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను కమిటీ పరిశీలించనుంది. ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో కమిటీ ఎన్‌డీఎస్‌ఏ బృందం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 2016 నుంచి ఆనకట్టల బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే బదిలీ అయిన, విశ్రాంత ఇంజనీర్లు కూడా సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో ఎన్‌డీఎస్‌ఏ కమిటీ విడివిడిగా సమావేశం అవుతోంది. ఇన్వెస్టిగేషన్స్, మోడల్ స్టడీస్, డిజైన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్ల నుంచి కమిటీ వివరాలు తీసుకుంటోంది. అవసరమైన సమాచారం, వివరాలను ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సేకరిస్తోంది.

ఇవి కూడా చదవండి...

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తియ్యటి శుభవార్త..

Kamal Haasan: కమల్‌హాసన్ పార్టీ డీఎంకే కూటమిలో చేరిక


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 09 , 2024 | 02:57 PM