Share News

MLC Kavitha: కులగణనకు చట్టబద్ధత కల్పించాలి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:02 PM

కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు.

MLC Kavitha: కులగణనకు చట్టబద్ధత కల్పించాలి

హైదరాబాద్: కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

తలాతోకని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బిహార్, కర్నాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అన్నది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలేని మాటలు మానుకోవాలని కవిత పేర్కొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:02 PM