Share News

TS NEWS: మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Jan 23 , 2024 | 09:39 PM

స్కూటీని డీసీఎం ఢీకొని సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లాకు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చి రామచంద్రపురం LIG కాలనీలో నివాసం ఉంటున్నాడు.

TS NEWS: మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్: స్కూటీని డీసీఎం ఢీకొని సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లాకు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చి రామచంద్రపురం LIG కాలనీలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం అతడు మియాపూర్‌కు స్కూటీపై బయలుదేరాడు. అయితే యువకుడు వెళ్తున్న స్కూటీని డీసీఎం అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దాంతో తీవ్ర రక్తస్రావం అయిన యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. భార్య రత్నంబా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 23 , 2024 | 09:41 PM