Share News

Minister Jupalli: మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్‌

ABN , Publish Date - Jan 13 , 2024 | 07:43 PM

మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్‌ ( Kite Festival ) నిర్వహిస్తున్నామని.. ఈ ఫెస్ట్‌కు 15 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) తెలిపారు.

Minister Jupalli: మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్‌

హైదరాబాద్: మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్‌ ( Kite Festival ) నిర్వహిస్తున్నామని.. ఈ ఫెస్ట్‌కు 15 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారన్నారు. పంట ఇంటికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటామని.. గ్రామాల్లో ఆ సందడి తగ్గిందన్నారు. అందరినీ భాగస్వాములను చేయడం కోసం ఈ కైట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. . వచ్చే సంవత్సరం నుంచి మండల్లాలో కూడా కైట్ ఫెస్టివల్ జరుపుతామని చెప్పారు. కరోనా వల్ల మూడేళ్లు కైట్ ఫెస్టివల్‌కి గ్యాప్ వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఆట పాటల వైపు కూడా పిల్లకి ఇంట్రెస్ట్ కలిగిలా కార్యక్రమలు ఉంటాయన్నారు. ఏ పండగ అయినా అందరూ పాల్గొనాలని.. తెలంగాణ ప్రాముఖ్యతని ప్రపంచం అంతటా వ్యాపించేలా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని రకాల సంపద మన దగ్గర ఉన్నప్పుడు మన గొప్పదనాన్ని చాటాలన్నారు. పర్యాటకులను రప్పించి ఆదాయాన్ని పెంచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి కైట్ ఫెస్ట్: మంత్రి ప్రభాకర్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి కైట్ ఫెస్ట్ జరుపుకుంటున్నామని.. అందరూ ఫెస్ట్‌కు రావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) తెలిపారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...టూరిజం శాఖని దేశంలోనే అగ్రగామిగా తీసుకెళ్తేందుకు ఆ శాఖ మంత్రి కష్టపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కొరుకుంటున్నానని అన్నారు. టూరిజం ఆదాయం పెరగాలని కోరుతున్నానని చెప్పారు. టూరిజం శాఖకి రవాణా శాఖ నుంచి మంచి తోడ్పాటు అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Updated Date - Jan 13 , 2024 | 07:43 PM