Share News

KTR: కాంగ్రెస్‌లో విలీనంపై మేము ఎవరినీ మోసగించలేదు

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:22 PM

కాంగ్రెస్‌లో అప్పటి టీఆర్ఎస్ విలీనంపై మేము ఎవరినీ మోసం చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) స్పష్టం చేశారు.

KTR: కాంగ్రెస్‌లో విలీనంపై మేము ఎవరినీ మోసగించలేదు

హైదరాబాద్: కాంగ్రెస్‌లో అప్పటి టీఆర్ఎస్ విలీనంపై మేము ఎవరినీ మోసం చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘విలీన చర్చల సందర్భంగా సోనియా గాంధీయే టీఆర్ఎస్‌ను దగా చేశారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కేసీఆర్ అప్పుడు చిత్త శుద్ధితోనే ఉన్నారు. తెలంగాణ వచ్చాక విలీనం చేసేందుకు సోనియా గాంధీని కూడా కేసీఆర్ కలిశారని.. కానీ సోనియా స్పందించకుండా దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడమంది. దిగ్విజయ్ సింగ్‌ను కలిస్తే మమ్మల్ని హేళనగా చూశారు.. పద్నాలుగేళ్ల పార్టీని నమ్ముకుని పని చేసిన కార్యకర్తలకు, నేతలకు ఏం భరోసా ఇస్తారని అడిగారు. చిరంజీవి పార్టీలాగే టీఆర్ఎస్‌ను విలీనం చేసి సముద్రంలో కలవండని దిగ్విజయ్ చులకనగా మాట్లాడారు. అందుకే కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా సింగిల్‌గా పోటీ చేసి టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీనే కేసీఆర్‌ను దగా, మోసం చేసింది. కానీ విలీనం చేయకుండా కేసీఆర్ మోసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..దీన్ని తప్పి కొట్టాలి.ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ బయటకు వస్తారు’’ అని కేటీఆర్ తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 10:22 PM