Share News

MLC Kavitha: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:37 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసారు. అసెంబ్లీ అవరణలో జ్యోతి బా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు 42 శాతం అవకాశాలు ఇస్తామని చెప్పిందన్నారు.

MLC Kavitha: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసారు. అసెంబ్లీ అవరణలో జ్యోతి బా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు 42 శాతం అవకాశాలు ఇస్తామని చెప్పిందన్నారు. జ్యోతి బా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ అవరణలో పెట్టాలని కోరుతూ.. ఈ మేరకు స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని, ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తున్నానన్నారు. పూలే లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని, పూలే జయంతి ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. దీనిపై అందరినీ ఏకం చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కవిత స్పష్టం చేశారు.

సోమవారం జరగనున్న అయోధ్య రామ్ లాల్లా విగ్రహ ప్రాణ ప్రతష్టకు తనకు ఆహ్వానం రాలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అయినా రాముడు అందరి వాడని, వీలు చూసుకుని అయోధ్యను సందర్శిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:37 PM