Share News

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:15 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది.

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ  పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
Kavitha

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది. మరోవైపు ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది.


చార్జ్‌షీట్‌‌లో కీలక విషయాలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలను కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ కేసులో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. ఈ కేసులో రూ.1100 కోట్ల వ్యాపారం జరిగిందని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. రూ. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు చెప్పింది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని ఈడీ పేర్కొంది. అయితే శరత్ చంద్రారెడ్డి A7, అమిత్‌ అరోరా A 14, అరుణ్ పిళ్ళై A26, మనీష్ సిసోడియా A 29, మాగుంట రాఘువరెడ్డి A18, మాగుంట కంపెనీ అగ్రో ఫోమ్స్ 19లను చార్జ్‌షీట్‌లో చేర్చింది


అయితే మొదటగా సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను కూడా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో పాస్ పోర్టు సరెండర్ చేయాలంటూ నిందితులను కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చరణ్ ప్రీత్ కేసు విచారణను జులై 3వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

National: నేడు రౌస్‌ అవెన్యూ కోర్టుకు కవిత

Delhi Liquor Scam: కవితకు మరో షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం..

Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్.. కోర్టులో మళ్లీ ట్విస్ట్..

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 03 , 2024 | 04:40 PM