Venkataramanareddy: ఈ కేసుతో బీజేపీకి ఏం సంబంధం...
ABN , Publish Date - Dec 20 , 2024 | 10:50 AM
Telangana: కేటీఆర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తప్పు చేయకుంటే న్యాయస్థానమే కేటీఆర్‌కు మినహాయింపు ఇస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు పెట్టిందన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 20: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Kamareddy MLA Katipalli Venkataramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ తప్పు చేయకుంటే భయమెందుకు అని ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలన్నారు. తన వాదనను కేటీఆర్ న్యాయస్థానంలో వినిపించుకోవచ్చన్నారు. కేటీఆర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. తప్పు చేయకుంటే న్యాయస్థానమే కేటీఆర్‌కు మినహాయింపు ఇస్తుందన్నారు.
కేటీఆర్ ఎపిసోడ్: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై కేసు పెట్టిందన్నారు. ఈ ఇద్దరిపై కేసులతో రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరకీ చేతకాకనే మధ్యలో బీజేపీని బద్నాం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై ఏసీబీ కేసుతో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. సభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యా్ఖ్యలు చేశారు.
కాగా.. ఫార్ములా ఈరేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవార) ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. ఈరేస్‌పై సభలో చర్చకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభ మొదలైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ రోజు ఉదయం సభ మొదలవగా వాయిదా తీర్మానంపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ ఫార్ములా కార్ రేసింగ్‌పై చర్చ కోసం బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై చర్చకు స్పష్టమైన హామీ ఇస్తేనే తాము సహకరిస్తామని అన్నారు.
ఇంటికి కొరియర్.. ఓపెన్ చేయగానే డెడ్‌బాడీ..
ఒక సభ్యునిపై కేసు పెట్టారని. సభ నడుస్తున్నప్పుడు ఆ సభ్యునికి వాస్తవం చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. కేటీఆర్‌పై పెట్టింది ముమ్మాటికి అక్రమ కేసే అని హరీష్ రావు అన్నారు. ఫార్ములా ఈరేస్‌పై చర్చ జరపాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. దీంతో వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్స్ విసురుకున్న పరిస్థితి. ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకనడంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...
Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కేటీఆర్ ఎపిసోడ్: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Read Latest Telangana News And Telugu News