Share News

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీళ్లు రావు..!

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:08 PM

Hyderabad News: నగర వాసులకు బిగ్ అలర్ట్. గురువారం నాడు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. మంజీర నీటి సరఫరా(Manjeera Water Supply) పంప్ హౌస్‌ల మరమ్మతులు, సబ్ స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కారణంగా హైదరాబాద్‌(Hyderabad)లోని పలు ప్రాంతాలలో ఫిబ్రవరి 29న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం..

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీళ్లు రావు..!
Hyderabad Water Supply

హైదరాబాద్, ఫిబ్రవరి 29: నగర వాసులకు బిగ్ అలర్ట్. గురువారం నాడు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. మంజీర నీటి సరఫరా(Manjeera Water Supply) పంప్ హౌస్‌ల మరమ్మతులు, సబ్ స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కారణంగా హైదరాబాద్‌(Hyderabad)లోని పలు ప్రాంతాలలో ఫిబ్రవరి 29న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేట్ బోర్డ్(Hyderabad Metropolitan Water Supply and Sewerage Board) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన ప్రకారం.. మంజీర నీటి సరఫరా పంపుహౌస్‌ల మరమ్మతులు, సబ్ స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కారణంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌ పరిధిలోని ప్రాంతాలు, కెపిహెచ్‌బి కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌ కాలనీ, వసంత్‌నగర్‌, ఆర్‌సిపురం, అశోక్‌నగర్‌, జ్యోతి నగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, దీప్తిశ్రీనగర్‌, మదీనాగూడ, మియాపూర్‌, మంజీర ఫేజ్-1 ఆన్‌లైన్‌లో నీటి సరఫరా, బీరంగూడ, అమీన్‌పూర్, బోల్లారంలోని ఇతర ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని ప్రకటనలో పేర్కొన్నారు. నీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 12:26 PM