Share News

TS High Court: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:25 PM

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ( Chennamaneni Ramesh ) పౌరసత్వంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు ( High Court ) విచారించింది.

TS High Court: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ( Chennamaneni Ramesh ) పౌరసత్వంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు ( High Court ) విచారించింది. చెన్నమనేని రమేష్ విదేశీ ప్రయాణాలు సంబంధించిన వివరాలు కోర్టుకు అడిషనల్ సొల్సిటర్ జనరల్ సమర్పించింది. జర్మనీ పౌరసత్వంతో జర్మనీ పాస్‌పోర్ట్ మీదనే విదేశాలకు వెళ్లినట్టు కేంద్రం నివేదిక ఇచ్చింది. రెండుసార్లు విదేశీ ప్రయాణాలు చేసినట్లు కేంద్రం నివేదిక ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవాలని సీనియర్ కౌన్సిల్ రవి కిరణ్ రావ్ కోర్టుకు తెలిపారు. హైకోర్టులో ఇరు వాదనలు పూర్తి అయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Updated Date - Jan 12 , 2024 | 10:57 PM