Share News

Adi Srinivas: కవిత తెగ హడావుడి చేస్తున్నారు.. మీ నాయకత్వం వారికి అవసరమా

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:44 PM

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ తమకు పట్టలేదన్నారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా? అని నిలదీశారు.  

Adi Srinivas: కవిత తెగ హడావుడి చేస్తున్నారు.. మీ నాయకత్వం వారికి అవసరమా
Adi srinivas

హైదరాబాద్, డిసెంబర్ 28: బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Govt Whip Adi srinivas ) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలతో అసలు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీసీలపైన ముసలి కన్నీరు, కపట ప్రేమ కవిత చూపిస్తోందని మండిపడ్డారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందని.. బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. ‘‘కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ మాకు పట్టలేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా? అని నిలదీశారు.  దేశానికి కులగణనలో తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా కులగణన జరిగిందన్నారు. రాహుల్ గాంధీ సూచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని తెలిపారు.


గిరిజనులు, మైనార్టీలకు12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. అప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పదేళ్లలో బీసీలను ఏనాడు పట్టించుకోలేదని.. ఏ కార్యక్రమాన్ని సరిగా అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌తో పాటు ఇతర కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీసీకు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదన్నారు. బీసీలపైన బీఆర్ఎస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే కులగణనను ఎందుకు ఆహ్వానించలేదని మరో ప్రశ్న వేశారు. కులగణనపైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని అన్నారు. సామాజిక, ఉపాధి, విద్యా, రాజకీయంగా బీసీ వాటా కులగణనతో తేలిపోతుందని... దానికి అనుగుణంగా వాటా దక్కుతుందన్నారు.

Dwaraka Tirumala Rao: ఏపీలో ఈ ఏడాది క్రైమ్‌ రేట్‌పై డీజీపీ ఏం చెప్పారంటే..



రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నట్లు కవిత ఆరోపణల్లో అర్థం లేదన్నారు. గందరగోళాన్ని సృష్టించడం కోసం ఆమె డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత అంటున్నారని.. సభ నిర్వహించడానికి కవిత ఎవరు అంటూ విరుచుకుపడ్డారు. కవిత నాయకత్వంలో జరిగే సభకు బీసీలు ఎవరూ హాజరుకావొద్దని పిలుపునిచ్చారు. అగ్రకులాల చెప్పు చేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు లేదన్నారు. లిక్కర్ కేసును జనం దృష్టి మళ్లించడానికి కవిత బీసీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. లిక్కర్ దందాలో ఆరు నెలలు జైల్లో ఉండొచ్చిన కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నారని.. బీసీ రిజర్వేషన్లు పెంచేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఈ పొలిటికల్ స్టార్‌కు బాగా కలిసొచ్చిన కాలం

బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 04:18 PM