TS NEWS: మాదాపూర్‌లో చిట్టీల పేరుతో మోసం.. భారీగా నష్టపోయిన బాధితులు
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:15 PM
మాదాపూర్‌లో చిట్టీల పేరుతో బాధితులను ఓ సంస్థ మోసం చేసింది. సమత మూర్తి చిట్ ఫండ్ ఫండ్ పేరుతో నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడ్డారు. బాధితుల నుంచి సుమారుగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
హైదరాబాద్: మాదాపూర్‌లో చిట్టీల పేరుతో బాధితులను ఓ సంస్థ మోసం చేసింది. సమత మూర్తి చిట్ ఫండ్ ఫండ్ పేరుతో నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడ్డారు. బాధితుల నుంచి సుమారుగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ చిట్ ఫండ్ సంస్థ వల్ల వందల సంఖ్యలో బాధితులు నష్టపోయారు. రెండు నెలల క్రితం మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే మొదటగా బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
దాంతో బాధితులు సైబరాబాద్ సీపీని ఆశ్రయించడంతో మాదాపూర్ పోలీసులు కదిలారు.. వెంటనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. శ్రీనివాస్, రాకేష్, గణేష్ జ్యోతి అనే నిందితులపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్, రాకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు గణేష్, జ్యోతి పరారీలో ఉన్నారని మాదాపూర్ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి తాము కట్టిన పైసలను వసూలు చేయాలని బాధితులు పోలీసులను విన్నవించారు. ఎంతమంది బాధితులను ఈ సంస్థ మోసం చేసింది.. ఈ సంస్థ కార్యాలయాలు రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంపై పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.