Share News

Cyberabad Police: న్యూఇయర్‌ సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఎంత మంది పట్టుబడ్డారంటే..?

ABN , Publish Date - Jan 01 , 2024 | 10:25 AM

Telangana: నగరంలో నూతన సంవత్సవరం సందర్భంగా యువత హంగామా అంతాఇంతా కాదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు.

Cyberabad Police: న్యూఇయర్‌ సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఎంత మంది పట్టుబడ్డారంటే..?

హైదరాబాద్: నగరంలో నూతన సంవత్సవరం సందర్భంగా యువత హంగామా అంతాఇంతా కాదు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే పలువురు మందు పార్టీలు కూడా చేసుకున్నారు. మందు సేవించి రోడ్లపైకి వచ్చిన పలువురు మందుబాబులు పోలీసులకు చిక్కారు. న్యూఇయర్ రోజు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అనేక మంది మందుబాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన మందుబాబుల వివరాలను ఈరోజు(సోమవారం) పోలీసులు మీడియాకు వివరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోని 1241 కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. అందులో 1239 మంది పురుషులు కాగా ఇద్దరు మహిళలపై కేసు నమోదు అయ్యింది.

ఎక్కువుగా 938 ద్విచక్ర వాహనాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలు 938, త్రీ వీలర్స్ 21, ఫోర్ వీలర్స్ 275, హెవీ వెహికల్స్ 7 మొత్తం 1241 కేసులు నమోదు అయ్యాయి. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారు 382 మంది ఉండగా.. 26 సంవత్సరాలు నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఎక్కువగా మియాపూనర్‌లో 253 కేసులు నమోదు అయ్యాయి. అయితే డ్రగ్స్ కిట్‌తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూసెన్స్, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2024 | 10:47 AM