TS NEWS: స్వేరోస్ తెలంగాణ నూతన కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Jan 01 , 2024 | 09:59 PM
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ధ్యేయంగా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థలకు, తెలంగాణ స్వేరో రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గురి దుర్గయ్య ఆధ్వర్యంలో స్వేరోస్ నూతన రాష్ట కమిటీని ఎన్నుకున్నారు.
హైదరాబాద్: అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ధ్యేయంగా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థలకు, తెలంగాణ స్వేరో రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గురి దుర్గయ్య ఆధ్వర్యంలో స్వేరోస్ నూతన రాష్ట కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చిలకబత్తిని. వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా దారమల్ల. ప్రకాశ్ , కోశాధికారిగా లక్నారపు శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా ప్రణీత శుభశ్రీ, ఉపాధ్యక్షులుగా మచ్చ నరసయ్య , శ్యామల, అజయ్, జగన్ , కార్యవర్గ సభ్యులుగా పులేందర్, రాజు , సాయన్న , దిలీప్ , మౌనిక , కిరణ్ , కపిల్ , రవి ,మారుతి , సురేష్ ,రాజు ,మనోజ్ , ప్రవీణ్ , పవన్ రాజ్‌తో పాటు పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్, వైస్ చైర్మన్ బాల ప్రసాద్, ఉషన్న, ఎర్రోళ్ల సత్యం , పుల్లా కిషన్, గడప రాజు. తదితరులు పాల్గొన్నారు.