Share News

Hyderabad: ఆ పథకం తెచ్చి భూదందా చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

ABN , Publish Date - Dec 18 , 2024 | 06:05 PM

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ధరణి(Dharani ) పేరుతో పెద్దఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయని భట్టి ధ్వజమెత్తారు.

Hyderabad: ఆ పథకం తెచ్చి భూదందా చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ధరణి (Dharani) పేరుతో పెద్దఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయని భట్టి ధ్వజమెత్తారు. సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములు చేతులు మారాయని ఉపముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ భూ దందాతో పోల్చితే కాళేశ్వరం వ్యవహారం చిన్న విషయమని ఆయన చెప్పారు.


ఓ వ్యక్తి గత రెండు, మూడేళ్లపాటు ప్రతి రోజూ ఇదే చేశారని, పార్ట్-బి భూములన్ని సక్రమం చేసుకున్నారని భట్టి ఆరోపించారు. దీని మెుత్తాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయబోతున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. హైదారాబాద్ పరిధిలోనే ఇలాంటి భూములు సుమారు 15 వేల ఎకరాలు ఉంటాయని అంచనా వేస్తు్న్నామని, అంత కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పార్ట్-బిలో భూమి అనుకున్న వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, ఆ తర్వాత వారు ఇంకొకరి పేరు మీద మ్యూటేషన్ చేశారని, ఇలా పెద్ద దందా జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.


ఈ భూముల గురించి అడిగేవారు లేరని.. ఇనాం, ఎండోన్మెంట్, వక్ఫ్, అవెక్యు భూములన్నీ లూటీ చేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల యజమానులు దేశంలో లేరని, వారంతా పాకిస్థాన్ వెళ్లారని, ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పకపోవడంతో అధికారులు సైతం సహకరించారని భట్టి ఆరోపించారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు, నలుగురు వ్యక్తుల మీద బదలాయింపు అయిందని ఆయన చెప్పారు. అదంతా ఇప్పుడు వాళ్ల హక్కు అయ్యిందని, ప్రభుత్వం ఎన్‌వోసీ ఇచ్చింది కాబట్టి భూమి వాళ్లదేనని చెప్పారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో అన్ని నిజాలూ నిగ్గు తేలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: నటితో అలా ప్రవర్తించిన ప్రముఖ యూట్యూబర్.. చివరికి ఏం జరిగిందంటే..

Hyderabad: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్.. కొడుకు కోసమేనా..

Updated Date - Dec 18 , 2024 | 06:06 PM