Share News

CM Revanth Reddy: చంద్రబాబుకు ఫేవర్ చేస్తారా? సీఎం రేవంత్ ఆన్సర్ ఇదే!

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:25 PM

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయడంపై కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవడం వల్ల ఏపీలో చంద్రబాబుకు ఏమైనా ఫేవర్ జరిగే ఛాన్స్ ఉందా? అని ఆర్కే ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy: చంద్రబాబుకు ఫేవర్ చేస్తారా? సీఎం రేవంత్ ఆన్సర్ ఇదే!
CM Revanth Reddy First Interview

CM Revanth Reddy First Interview With ABN MD RK: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆయనకు గురువుగా చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయడంపై కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవడం వల్ల ఏపీలో చంద్రబాబుకు ఏమైనా ఫేవర్ జరిగే ఛాన్స్ ఉందా? అని ఆర్కే ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.

కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మనో ధైర్యం వచ్చిందన్నారు రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం వల్ల.. చంద్రశేఖర్ రావు ఔట్ అండ్ ఔట్ ఏపీ సీఎం జగన్‌తో కలిసి ఉంటున్నారు. మరింత అతుక్కున్నట్లుగా ఉంటున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఇటీవల వీరిద్దరూ మీట్ అవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, తమిళనాడు, కర్ణాటక రాజకీయాలు ఎలాగో.. ఏపీ రాజకీయాలు కూడా తనకు అలాగే అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఏపీలో తమ పార్టీ నాయకులు ఉన్నారని, వారి నిర్ణయాలు వారు తీసుకుంటారని బదులిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Updated Date - Jan 06 , 2024 | 09:25 PM