Share News

Hyderabad: పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన.. ఓల్డ్‌సిటీ అభివృద్ధి చెందుతుందన్న రేవంత్

ABN , Publish Date - Mar 08 , 2024 | 06:35 PM

సుమారు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పాతబస్తీ మెట్రో(Old City Metro) శంకుస్థాపన కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతులమీదుగా శుక్రవారం జరిగింది. ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hyderabad: పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన.. ఓల్డ్‌సిటీ అభివృద్ధి చెందుతుందన్న రేవంత్

హైదరాబాద్: సుమారు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పాతబస్తీ మెట్రో(Old City Metro) శంకుస్థాపన కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతులమీదుగా శుక్రవారం జరిగింది. ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట ఎంపీ అసదుద్దీన్ తదితరులు ఉన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రోను పొడగించనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి.

దీనికి రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషిర్ గంజ్, ఫలక్ నుమా మెట్రో స్టేషన్లు ఉంటాయి. మత పరమైన నిర్మాణాలకు ఆటంకాలు సృష్టించకుండా మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. కేటాయించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు స్థల సేకరణకే వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు పాతబస్తీ మరింత అభివృద్ధి దిశలో దూసుకుపోనుంది.

Updated Date - Mar 08 , 2024 | 06:39 PM