Jani Master: రెగ్యులర్ బెయిల్‌ కోసం జానీమాస్టర్ పిటిషన్

ABN , First Publish Date - 2024-10-07T15:00:47+05:30 IST

Telangana: జానీ మాస్టర్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు రేపటికి (మంగళారం) వాయిదా వేసింది. అయితే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న జానీమాస్టర్ తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు.

Jani Master: రెగ్యులర్ బెయిల్‌ కోసం జానీమాస్టర్ పిటిషన్
Jani Master Case

రంగారెడ్డి, అక్టోబర్ 7: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) మరోసారి రంగారెడ్డి కోర్టులో (Rangareddy Court) పిటిషన్‌ వేశారు. జానీ మాస్టర్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. అయితే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న జానీమాస్టర్ తనకు రెగ్యులర్ బెయిల్ కావాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేశారు.

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించాం


కాగా..అంతకుముందు జానీ మాస్టర్‌కు రంగారెడ్డికోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును కేంద్రం నిలిపివేసింది. దీంతో జానీమాస్టర్‌కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే అంతకుముందే జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకుని.. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.


ఇదిలా ఉండగా.. యువతిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది.

TDP- BRS: టీడీపీ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు.. ఎవరంటే..


నాలుగు రోజుల కస్టడీలో జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలే తనను వేధింపులకు గురిచేసినట్లు కస్టడీలో వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.


ఇవి కూడా చదవండి...

Congress Vs BRS: గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి

Ponnam: ప్రతీ ఒక్కరు బీసీ సంక్షేమ గౌరవాన్ని కాపాడాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2024-10-07T15:43:48+05:30 IST