Share News

TS News: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి

ABN , Publish Date - Jan 20 , 2024 | 02:53 PM

Andhrapradesh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజాసింగ్‌‌కు కాల్ చేసి బెదిరింపులకు దిగిన వారిని ఖాకీలు గుర్తించారు. గత కొంతకాలం నుంచి రాజాసింగ్‌కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

TS News: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసులో పురోగతి

హైదరాబాద్, జనవరి 20: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (MLA Rajasingh) బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజాసింగ్‌‌కు కాల్ చేసి బెదిరింపులకు దిగిన వారిని ఖాకీలు గుర్తించారు. గత కొంతకాలం నుంచి రాజాసింగ్‌కు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని రాజాసింగ్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. బెదిరింపు కాల్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని కనిపెట్టారు. కువైట్‌లో మకాం వేసిన మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. రాజాసింగ్‌కు ఖాసిం ఫోన్‌ కాల్స్ చేస్తున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. 14 ఏళ్లుగా మహమ్మద్ ఖాసిం కువైట్‌లో ఉంటున్నాడు. చాంద్రాయణగుట్ట నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి కువైట్‌లో ఖాసిం సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో మహమ్మద్ ఖాసిం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ఎల్‌ఓసీని జారీ చేశారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌కు ఖాసిం బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 20 , 2024 | 03:29 PM