Share News

BRS: తెలంగాణ డీజీపీతో బీఆర్ఎస్ మహిళా నేతల భేటీ

ABN , Publish Date - Feb 27 , 2024 | 05:18 PM

Telangana: తెలంగాణ డీజీపీ రవి గుప్తాను బీఆర్‌ఎస్ మహిళా నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడికి సంబంధించి డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడి, కిడ్నాప్‌ల సంఘటనల విషయంలో దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.

BRS: తెలంగాణ డీజీపీతో బీఆర్ఎస్ మహిళా నేతల భేటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ డీజీపీ రవి గుప్తాను (Telangana DGP Ravi Gupta) బీఆర్‌ఎస్ మహిళా నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడికి సంబంధించి డీజీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇల్లందు మునిసిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లపై జరిగిన దాడి, కిడ్నాప్‌ల సంఘటనల విషయంలో దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా డీజీపీకి బీఆర్‌ఎస్ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులపై అధికారపార్టీ నాయకులు చేస్తున్న దాడులపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చర్యల కోసం ఆయా జిల్లాల ఎస్పీలకు తగు ఆదేశాలను ఇవ్వాలని బీఆర్ఎస్ మహిళా నేతలు కోరారు. డీజీపీని కలిసిన వారిలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 05:19 PM