Share News

Padi Kaushikreddy: ఇప్పటి నుంచి ఆట మొదలు.. కేసీఆర్ ఆట చూస్తారు..

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:26 PM

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

Padi Kaushikreddy: ఇప్పటి నుంచి ఆట మొదలు.. కేసీఆర్ ఆట చూస్తారు..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఈరోజు (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటి నుండి ఆట మొదలవుతుంది. కేసీఆర్ ఆట చూస్తారు’’ అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చినవే అని అన్నారు. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారని.. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. అబద్ధాల పునాదులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు.


హరీష్‌రావుతో పోలికా?..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS Goverment) రెండు లక్షల 38 వేల ఉద్యోగాలు ఇచ్చామో లేదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి పోలిక ఉందా అని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఎవరికి అందుబాటులో లేరన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎవరికి అందుబాటులో ఉండటం లేదన్నారు. సీఎం అయ్యాక ప్రజా దర్బార్‌లో ప్రజలను కలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఏమయ్యాయని నిలదీశారు. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 10 వేలు మాత్రమే అని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే ఎక్కువగా దేశంలో ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారో కాంగ్రెస్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ‘‘కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే అసెంబ్లీ సాక్షిగా నా ముక్కు నేలకు రాస్తా’’ అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 01 , 2024 | 02:26 PM