Share News

Telangana : ఉడుకుతున్న మెట్రోనగరాలు

ABN , Publish Date - May 29 , 2024 | 04:29 AM

దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత బాగా పెరిగింది. ఆ నగరాలన్నీ కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎ్‌సఈ) అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆ నగరాల్లో రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడలేని పరిస్థితి నెలకొంది.

Telangana : ఉడుకుతున్న మెట్రోనగరాలు

6 మెగా సిటీల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. రాత్రివేళల్లోనూ వేడి.. చల్లబడని వాతావరణం

నిర్మాణాలు పెరిగి తగ్గుతున్న పచ్చదనం

హైదరాబాద్‌లో 20 ఏళ్లలో నుంచి 24 శాతం పెరిగిన నిర్మాణ ప్రాంతం

ఢిల్లీకి చెందిన సీఎ్‌సఈ అధ్యయనం

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత బాగా పెరిగింది. ఆ నగరాలన్నీ కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎ్‌సఈ) అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆ నగరాల్లో రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడలేని పరిస్థితి నెలకొంది. సీఎ్‌సఈ సంస్థ తన అధ్యయన నివేదికను.. ‘‘డీకోడింగ్‌ ది అర్బన్‌ హీట్‌ స్ట్రెస్‌ ఏమాంగ్‌ ఇండియన్‌ సిటీస్‌’’ అనే పేరుతో మంగళవారం విడుదల చేసింది.

దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంభై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె నగరాల్లో 2001 నుంచి 2024 నడుమ వాతావరణ పరిస్థితులపై స్టడీ చేసింది. ఈ ఆరు నగరాలను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా విభిన్న వాతావరణ మండలాల్లో (క్లైమెట్‌జోన్స్‌) ఉండడమే. ఆ నివేదిక ప్రకారం.. రాత్రివేళల్లో కూడా ఈ మెగా సిటీలు చల్లబడటం లేదు. 2001-2010 మధ్య కాలంలో వేసవిలో భూఉపరితల ఉష్ణోగ్రతలు పగటిపూటతో పోలిస్తే రాత్రివేళకు 6.2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 13.2 డిగ్రీల మేర తగ్గేవని ఆ స్టడీ పేర్కొంది.

2014-23 నడుమ ఆ తేడా 6.2 డిగ్రీల నుంచి 11.5 డిగ్రీలకు తగ్గినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌లో 2001-10 నడుమ పగటి-రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా 13 డిగ్రీలుగా ఉంటే.. 2014-23 నడుమ ఆ తేడా 11.5 డిగ్రీలకు పడిపోయినట్టు తెలిపింది.


ఇక, గ్రీన్‌కవర్‌ ఏరియా విషయానికి వస్తే.. 2003- నుంచి 2023 నడుమ ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో పచ్చదనం పెరగ్గా, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో పచ్చదనం తగ్గినట్టు అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో 2003లో 32.6 శాతంగా ఉన్న గ్రీన్‌కవర్‌ ఏరియా.. 2022 నాటికి 44.2 శాతానికి పెరిగింది. అక్కడ నిర్మాణ ప్రాంతం కూడా 2003లో 31.4ు నుంచి 2022లో 38.2 శాతానికి పెరిగింది.

  • ముంబైలో నిర్మాణ ప్రాంతం 2003లో 38.4ు నుంచి 2023లో 52.1 శాతానికి పెరగ్గా.. పచ్చదనం 35.8ు నుంచి 30.2 శాతానికి తగ్గింది.

  • కోల్‌కతాలో నిర్మాణప్రాంతం 2001లో 70ు నుంచి 2023లో 80.1 శాతానికి పెరగ్గా.. పచ్చదనం 15.2ు నుంచి 14.5 శాతానికి తగ్గింది.

  • హైదరాబాద్‌లో నిర్మాణప్రాంతం 2003లో 20.6ు నుంచి 2023లో 44 శాతానికి.. పచ్చదనం 8.9ు నుంచి 26.5 శాతానికి పెరిగాయి.

  • బెంగళూరులో నిర్మాణప్రాంతం 2003లో 37.5ు నుంచి 2023లో 71.5 శాతానికి.. పచ్చదనం 18.8ు నుంచి 26.4 శాతానికి పెరిగాయి.

  • చెన్నైలో నిర్మాణప్రాంతం 30.7ు నుంచి 73.5 శాతానికి పెరగ్గా.. పచ్చదనం మాత్రం 34 శాతం నుంచి 20.3 శాతానికి తగ్గింది.

  • హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా....

2001-10 నుంచి 2014-23 మధ్య కాలంలో వేసవిలో హైదరాబాద్‌ నగరంలో వాతావరణంలో తేమ(హ్యుమిడిటీ లెవల్స్‌) శాతం పది శాతం మేరకు పెరిగింది.

అలాగే.. నగరంలో వేగంగా నిర్మాణ ప్రాంతం పెరుగుతూ వస్తోంది. దీనికి పట్టణ ఉష్ణోగ్రతలు పెరగడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. వేసవిలో పగటివేళల్లో చుట్టుపక్కల ప్రాంతాల

కంటే నగరంలో 0.7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ రాత్రిపూట మాత్రం దాని పరిసర ప్రాంతాలకంటే సగటున 1.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

Updated Date - May 29 , 2024 | 04:29 AM