Share News

Hyderabad: ఓయోలో విగతజీవిగా ఏపీ గవర్నమెంట్ టీచర్.. ఏమైంది..?

ABN , Publish Date - May 26 , 2024 | 05:29 PM

భాగ్యనగరంలోని ఓ లాడ్జీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన గవర్నమెంట్ టీచర్ విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేకుంటే హత్య చేశారా..? అన్నది తెలియట్లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Hyderabad: ఓయోలో విగతజీవిగా ఏపీ గవర్నమెంట్ టీచర్.. ఏమైంది..?

హైదరాబాద్, ఆంధ్రజ్యోతి మే-26: భాగ్యనగరంలోని ఓ లాడ్జీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన గవర్నమెంట్ టీచర్ విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేకుంటే హత్య చేశారా..? అన్నది తెలియట్లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న జయప్రకాష్ నారాయణ (35) ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులు కావడంతో రాయచోటి నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఆయన.. శనివారం నుంచి కనిపించట్లేదని కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది.


Miyapur-Police-Station.jpg

నిన్న మిస్సింగ్.. ఇవాళ ఇలా!

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన జయప్రకాష్ ఇవాళ ఓయో లాడ్జీలో విగతజీవిగా కనిపించారు. శనివారం మధ్యాహ్నం మియాపూర్ మదీనాగూడాలోని ఓయో లాడ్జిలో రుమ్ తీసుకున్నట్లు తేలింది. అయితే.. విషం(టాబెట్లు) తీసుకోని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయప్రకాష్‌ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా హత్యనా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా మొదట కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు ముందు ఏం జరిగింది..? కుటుంబంలో కానీ.. బయట గానీ ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫైనల్‌గా ఏం తేలుతుందో చూడాలి మరి.

AP Elections: బాబోయ్.. లేడీ బాస్‌ గౌతమి చుక్కలు చూపిస్తున్నారుగా..!


Updated Date - May 26 , 2024 | 05:43 PM