Share News

TS News: జీహెచ్‌ఎంసీలో అడ్వర్టైజ్‌మెంట్ అక్రమాలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:04 AM

Andhrapradesh: జీహెచ్ఎంసీలో అడ్వర్టైజ్‌మెంట్ అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా బస్ స్టాపులు, ట్రాఫిక్ గొడుగులపై ప్రకటనలు వెలిశాయి. అక్రమ అడ్వర్టైజ్‌మెంట్‌పై ఈవీడీఎం చర్యలు చేపట్టింది. గత రాత్రి పలు ప్రాంతాల్లో అక్రమ ప్రకటనలను అధికారులు తొలగించారు. 80 ట్రాఫిక్ పోలీసుల గొడుగులు.. 20 బస్ షెల్టర్ల ప్రకటనలను అధికారులు తొలగించారు.

TS News: జీహెచ్‌ఎంసీలో అడ్వర్టైజ్‌మెంట్ అక్రమాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 27: జీహెచ్ఎంసీలో (GHMC) అడ్వర్టైజ్‌మెంట్ అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా బస్ స్టాపులు, ట్రాఫిక్ గొడుగులపై ప్రకటనలు వెలిశాయి. అక్రమ అడ్వర్టైజ్‌మెంట్‌పై ఈవీడీఎం చర్యలు చేపట్టింది. గత రాత్రి పలు ప్రాంతాల్లో అక్రమ ప్రకటనలను అధికారులు తొలగించారు. 80 ట్రాఫిక్ పోలీసుల గొడుగులు.. 20 బస్ షెల్టర్ల ప్రకటనలను అధికారులు తొలగించారు. కేబీఆర్ పార్క్ చుట్టు నాలుగు బస్ షెల్టర్లను ఈవీడీఎం పూర్తిగా తొలగించింది. ఇటీవలే కౌన్సిల్‌లో అడ్వర్టైజ్‌మెంట్ అక్రమాలను కార్పొరేటర్లు లేవనెత్తిన విషయం తెలిసిందే. నిన్ననే ప్రకటనల డీఈ కార్తీక్‌పై బదిలీ వేటు పడింది. ప్రకటనల టెండర్ల గడువు ముగిసిన ఎలాంటి ప్రక్రియ లేకుండానే కొత్త కంపెనీలు వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని కార్పొరేటర్ల ఆరోపణలు గుప్పించారు. ప్రకటనల అక్రమాలపై మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalaxmi) హౌస్ కమిటీ వేయగా... అక్రమ ప్రకటనల తొలగింపునకు బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 11:04 AM