Formula Erace: ఫార్ములా ఈరేస్ కేసు.. ఏసీబీ విచారణ ముమ్మరం
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:55 PM
Telangana: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఈరోజు (శుక్రవారం) ఏసీబీ విచారణను ప్రారంభించింది. హెచ్‌ఎండీ, ఆర్థికశాఖకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ తెప్పించుకుని విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఎమ్‌ఈయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ తీసుకోనుంది.
హైదరాబాద్, డిసెంబర్ 20: ఫార్ములా ఈరేస్ కేసులో (Formula E Race Case) ఏసీబీ (ACB) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి చేరుకున్నారు. ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ నిన్న(గురువారం) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవోను చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఈరోజు (శుక్రవారం) ఏసీబీ విచారణను ప్రారంభించింది. హెచ్‌ఎండీ, ఆర్థికశాఖకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ తెప్పించుకుని విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఎమ్‌ఈయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ తీసుకోనుంది. ఐఏఎస్ అధికారి దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను కూడా ఏసీబీ విచారణాధికారి రికార్డ్ చేయనున్నారు. వీరి స్టేట్‌మెంట్‌తో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG Highcourt: కేటీఆర్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
కాగా.. ఫార్ములా ఈకార్ రేస్ కేసులో రూ.55 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, విదేశీ కంపెనీకి ఈ నిధులను అప్పనంగా కట్టబెట్టారని ఏసీబీ అధికారులు ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించారు. కాసేపటి క్రితమే ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షణలోనే విచారణ జరిగే అవకాశం ఉంది. ఒక డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదు మంది సభ్యులు.. ఈకార్ రేసింగ్ వ్యవహరానికి సంబంధించి విచారణ జరపాలని ఏసీబీ భావిస్తోంది.

హైకోర్టుకు కేటీఆర్...
మరోవైపు ఫార్ములా ఈరేస్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. అసలు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనే దానిపై మధ్యాహ్నం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరిస్తే.. ప్రభుత్వ తరపు న్యాయవాది, కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు విన్న తరువాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఒకవేళ కోర్టు విచారణకు నిరాకరిస్తే రేపు(శనివారం) మరోసారి రెగ్యులర్ పిటిషన్‌ను దాఖలు చేసి విచారణ చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇంటికి కొరియర్.. ఓపెన్ చేయగానే డెడ్‌బాడీ..
అయితే ఈరేస్‌లో రూ.55 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని.. వీటికి సంబంధించి అప్పటి మంత్రిని కేటీఆర్‌ను విచారణ జరిపితే మరికొన్ని విషయాలు బయటపడతాయని ఏసీబీ స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఏసీబీ నోటీసులు ఇస్తుందా.. లేక ఐఏఎస్ అధికారుల విచారణ అనంతరం కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కేటీఆర్ ఎపిసోడ్: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Read Latest Telangana News And Telugu News