Share News

Hyderabad: 24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..!

ABN , Publish Date - May 19 , 2024 | 10:34 AM

వేసవిలో ఏర్పడ్డ నీటి డిమాండ్‌ను అధిగమించి వాటర్‌బోర్డు(Waterboard) నగరవాసులకు ట్యాంకర్‌ బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే డెలివరీ చేస్తోంది. నగరంలో భూగర్భ జలాలు అడుగంటి వాటర్‌బోర్డు నీళ్లే ఆధారమవడంతో ట్యాంకర్ల బుకింగ్‌ పెద్దఎత్తున పెరగ్గా, మూడు నాలుగు రోజులకు ట్యాంకర్‌ డెలివరీ అయ్యేది.

Hyderabad: 24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..!

- 12 గంటలకు చేరేలా వాటర్‌బోర్డు చర్యలు

హైదరాబాద్‌ సిటీ: వేసవిలో ఏర్పడ్డ నీటి డిమాండ్‌ను అధిగమించి వాటర్‌బోర్డు(Waterboard) నగరవాసులకు ట్యాంకర్‌ బుక్‌ చేసుకున్న 24 గంటల్లోనే డెలివరీ చేస్తోంది. నగరంలో భూగర్భ జలాలు అడుగంటి వాటర్‌బోర్డు నీళ్లే ఆధారమవడంతో ట్యాంకర్ల బుకింగ్‌ పెద్దఎత్తున పెరగ్గా, మూడు నాలుగు రోజులకు ట్యాంకర్‌ డెలివరీ అయ్యేది. 15 రోజుల క్రితం వరకు కూడా ట్యాంకర్‌ బుకింగ్‌ చేసిన రెండు రోజులకు ట్యాంకర్‌ వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి అధిగమించి బుకింగ్‌ చేసిన 24 గంటల్లో ట్యాంకర్‌ను డెలివరీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే, బుకింగ్‌ చేసిన 12 గంటల్లోనే ట్యాంకర్‌ డెలివరీ చేస్తామని గతంలో ప్రకటించిన అధికారుల లక్ష్యం ఎప్పటికీ నెరవేరుతోందో చూడాలి మరి.

ఇదికూడా చదవండి: Kaleshwaram Project: బ్యారేజీల అధ్యయనం, మరమ్మతులు ఏకకాలంలో!


ట్యాంకర్ల డిమాండ్‌ను అధిగమించారు ఇలా..!

- ట్యాంకర్ల సంఖ్య పెంచడం. కొత్త ట్యాంకర్ల కొనుగోలుతో పాటు ఇతర సోర్సుల నుంచి అద్దెకు తీసుకొచ్చారు.

- వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు, వాటర్‌ ఫిల్లింగ్‌ పాయింట్లను పెంచారు. ట్యాంకర్లు వేచి చూసే పరిస్థితి లేకుండా చేశారు.

- ట్యాంకర్లు ఉన్నా.. వాటిని నడిపేందుకు సిబ్బంది లేకపోవడంతో.. జీహెచ్‌ఎంసీ నుంచి కొంతమంది డ్రైవర్లను సమకూర్చుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు.

- ట్యాంకర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేసి వాటర్‌బోర్డు పరిధిలోని వివిధ సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల నుంచి సమన్వయం చేసుకుని వినియోగదారులకు మంచిసేవలు అందించేలా చర్యలు చేపట్టారు.

- అన్ని ఫిల్లింగ్‌స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలు.. ప్రధాన కార్యాలయానికి అనుసంధానం కావడంతో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించారు.

- ట్యాంకర్‌ బుకింగ్‌ మొదలు... డెలివరీ వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాటర్‌బోర్డు ప్రత్యేక యాప్‌ రూపొందించింది. ఫుడ్‌ డెలివరీ యాప్‌ తరహాలో ట్రాకింగ్‌ యాప్‌ తయారు చేసింది. దీని వల్ల వినియోగదారులు తాము బుక్‌ చేసుకున్న ట్యాంకర్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పలు ఫిల్లింగ్‌స్టేషన్లలో అమలు చేసి పరీక్షిస్తున్నారు.


మొత్తం ట్యాంకర్లు 613 840 872

ఫిల్లింగ్‌ స్టేషన్లు 70 88 89

ఫిల్లింగ్‌ పాయింట్స్‌ 108 162 164

రోజు వారీ బుకింగ్స్‌ 4945 7193 4065

రోజు వారీ డెలివరీ 6579 9275 6016

సరఫరా చేసిన ట్రిప్పులు 1,68,996 2,37,570 1,41,550


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 19 , 2024 | 10:34 AM