Hyderabad: ఇక చాలు.. ఆపండి.. బోర్డుకు విధేయత చూపండి
ABN , Publish Date - Dec 18 , 2024 | 06:43 AM
‘ఇప్పటి వరకు ఎలా ఉన్నారో కానీ.. ఇక నుంచి వాటర్‌బోర్డుకు విధేయత చూపండి. బోర్డు పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ అడ్డగోలు ప్రచారాలు మానుకోవాలి’ అంటూ వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి(Water Board MD Ashok Reddy) గరం గరమయ్యారు.
- అడ్డగోలు ప్రచారాలు మానుకోవాలి
- వాటర్‌బోర్డు ఎండీ ఆగ్రహం
హైదరాబాద్ సిటీ: ‘ఇప్పటి వరకు ఎలా ఉన్నారో కానీ.. ఇక నుంచి వాటర్‌బోర్డుకు విధేయత చూపండి. బోర్డు పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ అడ్డగోలు ప్రచారాలు మానుకోవాలి’ అంటూ వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి(Water Board MD Ashok Reddy) గరం గరమయ్యారు. వాటర్‌బోర్డులోని సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో నిర్వహించే వివిధ సమీక్షా సమావేశాల్లో ‘నీటి సరఫరా మెరుగ్గా జరగాలి. పనుల్లో వేగం పెంచాలి’ అంటూ హితబోధ చేసే ఎండీ అశోక్‌రెడ్డి తాజాగా జరిగిన సమావేశంలో మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
కొందరు అధికారుల పని, పద్ధతులనే కాదు.. ప్రభుత్వం పట్ల అడ్డగోలుగా నోరు జారడంపై సున్నితంగానే మందలించారు. పబ్లిక్ సర్వెంట్లమనే విషయాన్ని గుర్తుంచుకొని పని చేయాలని సూచించారు. వాటర్‌బోర్డు పనుల్లో నాణ్యత పెంచేందుకు తాజాగా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. కొందరు అధికారుల తీరుపై ఈ సమావేశంలో గట్టిగానే మందలించినట్లు తెలిసింది. ఇటీవల కొందరు జీఎంలు, డీజీఎంలు ఓ ఎమ్మెల్యే(MLA)తో సమావేశమై ప్రభుత్వం, బోర్డు పట్ల వ్యతిరేకమైన అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది.
ఈ అంశాలన్నీ ఎండీ దృష్టికి రావడంతో తాజా సమావేశంలో సీరియన్ అయినట్లు సమాచారం. వాటర్‌బోర్డు ప్రతిష్ఠను దిగజార్చేవిధంగా.. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. బోర్డులో పనులు ఆగిపోయాయంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. మీరు స్మార్ట్‌గా ఉంటే.. తాను ఓవర్ స్మార్ట్‌నవుతానంటూ చెప్పినట్లు సమాచారం.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News