Share News

Hyderabad: ఎస్‌ఐపై ఎస్సీఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు..

ABN , Publish Date - May 23 , 2024 | 12:24 PM

మధురానగర్‌ పోలీసుల తీరు వివాదాస్పదమైంది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మాధవి(SI Madhavi)పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు.. వెస్టుజోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌కు బాధితులు ఫిర్యాదు చేశా రు.

Hyderabad: ఎస్‌ఐపై ఎస్సీఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు..

- దంపతులను కాలితో తన్నిందని ఆరోపణ

హైదరాబాద్‌ సిటీ: మధురానగర్‌ పోలీసుల తీరు వివాదాస్పదమైంది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మాధవి(SI Madhavi)పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు.. వెస్టుజోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌కు బాధితులు ఫిర్యాదు చేశా రు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన దంపతులను కులంతో పేరుతో దూ షించడంతో పాటు వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళా బాధితురాలి ప్రైవే ట్‌ పాట్స్‌పై కాలితో తన్ని అవమానించిందని బాధితులు బుధవారం ఎస్సీఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వెస్ట్‏జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌(West Zone DCP Vijaykumar)కు కంప్లైంట్‌ చేసినట్లు తెలిపారు. ఈనెల 17వ తేది రాత్రి 9గంటల ప్రాంతంలో ఎర్రోళ్ల రమేష్‌ మధురానగర్‌లోని మధురావైన్స్‌కు మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అక్కడ డబ్బులు చెల్లించే విషయంలో వైన్‌షాపు(Wineshop) సిబ్బందికి అతడికి వివా దం తలెత్తింది. దాంతో వైన్‌షాపు సిబ్బంది రమేష్‌ను కొట్టారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఆస్పత్రికి వెళ్లి గాయాలు చూపించి ఎమ్‌ఎల్‌సీ (మెడికోలీగల్‌ కేసు) తీసుకురమ్మని తెలిపారు. అందు కోసం ఎస్‌ఆర్‌ నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి రమేష్‌ భార్య సాజిదాబేగం వెళ్లారు. ఈలోపు కానిస్టేబుల్‌ ఫోన్‌చేసి వైన్‌షాపు వద్దకు రమ్మన్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: నర్సాపూర్‌లో మహారాష్ట్ర పోలీసుల సోదాలు..


దాంతో ఇద్దరూ వైన్‌షాపునకు వచ్చారు. అక్కడకు రాగానే తన భార్యపట్ల వారు గుసగుసలాడారని, దీంతో ఆమె ఆవేశంలో వారితో వాగ్వాదానికి దిగిందని, ఆ సమయంలో వారు తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పాడు. అనంతరం కానిస్టేబుల్‌ రమేష్‌, సాజిదాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్‌ఐ ఏ.మాధవిరెడ్డి కేసు వివరా లు తీసుకునే క్రమంలో అసభ్యంగా మాట్లాడిందని, తమపై కోపంతో తనను కొట్టిందని, కాలుతో తన ప్రైవేట్‌ ప్రదేశంలో తన్నిందని సాజిదా తన భర్తతో కలిసి వెళ్లి ఎస్సీఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. వైన్‌షాపు నిర్వాహకులపై ఒక కేసు నమోదు చేసి, తమపై రెండు కేసులు నమోదు చేసిందని తెలిపారు. తమపై దాడిచేసి కులం పేరుతో దూషించిన మహిళా ఎస్‌ఐ మాధవిపై చర్యలు తీసుకో వాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించిన ఎర్రోళ్ల రమేష్‌ సాజిదాలు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి స్పందిస్తూ.. రమేష్‌ సాజిదా బేగంలో తమ సిద్ధం సిబ్బందిపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి ఘటన పోలీస్‌ స్టేషన్‌లో జరగలేదని వివరించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 12:24 PM