Share News

Hyderabad: కులగణనను వ్యతిరేకించే వారంతా ప్రజా ద్రోహులే..

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:32 PM

కులగణనను వ్యతిరేకించే వారంతా ప్రజా ద్రోహులని, రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కాలంటే కులగణన విజయవంతం కావాలని పలువురు ప్రొఫెసర్లు, ఇంజనీర్లు(Professors, engineers) అన్నారు. 77ఏళ్ల తర్వాత జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణ ప్రజలంతా స్వాగతించాలని పిలుపునిచ్చారు.

Hyderabad: కులగణనను వ్యతిరేకించే వారంతా ప్రజా ద్రోహులే..

- పీపుల్స్‌ కమిటీ సమావేశంలో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు

హైదరాబాద్‌ సిటీ: కులగణనను వ్యతిరేకించే వారంతా ప్రజా ద్రోహులని, రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కాలంటే కులగణన విజయవంతం కావాలని పలువురు ప్రొఫెసర్లు, ఇంజనీర్లు(Professors, engineers) అన్నారు. 77ఏళ్ల తర్వాత జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణ ప్రజలంతా స్వాగతించాలని పిలుపునిచ్చారు. పీపుల్స్‌ కమిటీ ఆన్‌ కాస్ట్‌ సెన్సెస్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో కులగణనపై జరుగుతున్న అసత్యప్రచారానికి వ్యతిరేకంగా ఆ కమిటీ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆధార్‌, ఫోన్‌ నంబర్లు ఇవ్వండి చాలు.. మిగిలినవి వాళ్లే నింపుకుంటారు


ఈ సందర్భంగా ప్రొ.కె.మురళీమనోహర్‌ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కులగణనను కొంతమంది, కొన్ని సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు కులగణనకు మద్దతు పలికిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రొ.ఎస్. సింహాద్రి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు కొంతమంది మెలికలు పెట్టి కులగణనను వ్యతిరేకించే ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలన్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌తో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు సర్వేలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో ప్రొ.వినుకొండ తిరుమలి, ప్రొ.సుదర్శన్‌రావు, ప్రొ. పీఎల్‌. విశ్వేశ్వరరావు, ఇంజనీర్లు దేవల్ల సమ్మయ్య, సతీష్‌ కొట్టే, తుల్జరాంసింగ్‌లు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేతో అణగారిన కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. కులగణన ప్రశాంతంగా జరిగేవిధంగా అన్ని రాజకీయపార్టీలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరు వినోద్‌ కురవ, ప్రొ.నరేంద్రబాబు, ప్రొ.రాధాకృష్ణ, ప్రొ.నాగుల వేణు, భద్రయ్య, భాస్కర్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 01:32 PM