Hyderabad: ఆధార్, ఫోన్ నంబర్లు ఇవ్వండి చాలు.. మిగిలినవి వాళ్లే నింపుకుంటారు
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:03 PM
కూకట్‌పల్లి, మూసాపేట్(Kukatpally, Moosapet) సర్కిళ్ల పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే మందకొడిగానే జరుగుతోంది. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాల్సిన ఎన్యుమరేటర్లకు ఇచ్చిన బుక్‌లెట్‌లో పూర్తిస్థాయి వివరాల సేకరణ ఎలా నింపాలో కూడా తెలియడం లేదు. బాలాజీనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఎన్యుమరేటర్ నింపి ఇవ్వండని చెప్పారు.

- ఇంటింటి కుటుంబ సర్వేలో విచిత్రాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి, మూసాపేట్(Kukatpally, Moosapet) సర్కిళ్ల పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే మందకొడిగానే జరుగుతోంది. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాల్సిన ఎన్యుమరేటర్లకు ఇచ్చిన బుక్‌లెట్‌లో పూర్తిస్థాయి వివరాల సేకరణ ఎలా నింపాలో కూడా తెలియడం లేదు. బాలాజీనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఎన్యుమరేటర్ నింపి ఇవ్వండని చెప్పారు. ఎక్కడ ? ఎలా ? అంటే అవేమీ వద్దులే మీ ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్ ఇవ్వండి తర్వాత వాళ్లే నింపుకొంటారని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పొచ్చు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆధార్.. ఇయ్యట్లే
మూసాపేట్(Moosapet)లో ఇలాగే మాది ఆంధ్ర... మాకు ఇక్కడ ఏమీ లేదు... ఏమి చేయమంటారు..? మీకు తెలిసింది రాసివ్వండి.. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేసి వివరాలు కావాలంటే అడుగుతారని చెప్పి ఎన్యుమరేటర్లు చకచకా ముందుకు వెళ్లిపోతున్నారు. సూపర్ వైజర్ల పర్యవేక్షణ కొరవడడంతో ఎన్యుమరేటర్లకు ఉన్న అవగాహనతో అరకొర వివరాలతోనే సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది.
కులం అనుబంధ కాలం లేకపోవడంతో ఎన్యుమరేటర్‌ను అడిగితే తెల్లమొఖం వేయడం తప్ప సదరు వ్యక్తి నుంచి ఎటువంటి సమాధానం లేదు. సర్వే దరఖాస్తులు నింపాల్సింది ఎవరు? అనేదానిపై కూడా సరైన అవగాహన లేకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడంతో ఎక్కడా పూర్తివివరాలతో సర్వే జరుగుతుందన్న దాఖలాలు కన్పించడం లేదు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News